Take a fresh look at your lifestyle.

గణితంలో మేటి.. అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థులకు అంతర్జాతీయ పతకాలు

ముద్ర, కరీంనగర్ :
విద్యార్థులకు ప్రాథమిక దశ ఉండే గణిత శాస్త్రం పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పట్టు సాధించేదందుకు ప్రోత్సాహాన్ని అందించాలని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు గణిత శాస్త్రం చాలా ముఖ్యమైనదని మరియు అన్ని పోటీ పరీక్షలలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందని వారు చెప్పారు. గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇప్పిస్తున్నామని మరియు వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటువంటి పోటీ పరీక్షలకు సైతం ఎంపిక చేస్తున్నామని వారు చెప్పారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి శిక్షణ ఇస్తూ ఉత్తమ స్థానాలలో స్థిరపడేటట్టు ప్రోత్సాహం అందిస్తున్నామని వారు చెప్పారు.

ఈ క్రమంలో ఇటీవల కాలంలో యూనిఫైడ్ కౌన్సిల్ వారు నిర్వహించినటువంటి అంతర్జాతీయ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో పాఠశాలకు చెందినటువంటి జతిన్ సిద్ధార్థ, 4వతరగతి, డి.సిన్దశ్రీ,6వ తరగతి, క్రిషిక్ ప్రీన్స్, 7వ తరగతి, నడిపెల్లి సహార్ష్, 9వ తరగతి & శివ స్మరణ్ రెడ్డి, 9వ తరగతి ప్రశంసా పత్రాలను మరియు పతకాలు సాధించినట్లు వారు హర్షం వ్యక్తం చేశారు.విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు పుష్పగుచాలతో అందజేసి భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.