- ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
- చింతగట్టులో పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి.
- కోటి రూపాయల నిధులతో శంకుస్థాపన.
- హాజరైన కమిషనర్, కార్పొరేటర్.
హనుమకొండ, ముద్ర: పద్మశాలిల అభ్యున్నతికి కృషి చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని చింతగట్టు క్యాంపు వద్దగల పద్మశాలి స్థలంలో పద్మశాలి సంఘ భవన నిర్మాణం పనులకు ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి శ్రీకారం చుట్టారు. కోటి రూపాయల నిధులు విడుదల కాగా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రభుత్వం పద్మశాలిల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, చేనేత రంగానికి నూతన జీవం పోస్తుందన్నారు. ఇప్పటికే చేనేత రంగానికి చేయూతనిస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలతో పద్మశాలీల అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పారు.అన్ని రంగాల్లో పద్మశాలీలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో పద్మశాలి కుల సంఘ భవనాన్ని అధునాతనంగా నిర్మించి పద్మశాలి కులస్తులకు అన్ని విధాల ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు.ఈ సందర్భంగా పద్మశాలీల నినాదాలు హోరెత్తించాయి.ఈ కార్యక్రమంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్ వరంగంటి అరుణ కుమారి, కమలాపూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి,అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్,కార్యదర్శి వైద్యం రాజగోపాల్, తవుటం రవీందర్,వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, ప్రధాన కార్యదర్శి గోరంటాల రాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, రాష్ట్ర నాయకులు గడ్డం భాస్కర్, కేశవామూర్తి,కుసుమ సతీష్,వేముల సదానందం, జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్,బండ యాదగిరి,వెంగళ వేణుగోపాల్,సత్కూరి సంతోష్ , శ్రీరాముల విజయ్, గైని సత్యనారాయణ, కేదాసి రాకేష్, బోప్ప శివశంకర్,గుండు పూర్ణచందర్, శ్యామ్, చక్రపాణి, ఆనందం,పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.