ముద్ర కూకట్‌పల్లి :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ పాల్గొన్నారు. స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు వారి స్వగృహాలకు వెళ్ళిన ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ఆతిథ్యం స్వీకరించారు.
ఈ సందర్భంగా పట్వారీ శశిధర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దానగుణం, భక్తికి రంజాన్ మాసం ప్రతీక అని కొనియాడారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలతో, ఖురాన్ పఠనంతో, ప్రత్యేక ప్రార్థనలతో (తరావీహ్) భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. సమాజంలో శాంతి, పరస్పర సహకారం మరియు ఐకమత్యం వెల్లివిరియాలని కోరుకుంటూ, ముస్లిం సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ లేబర్ సెల్ ప్రెసిడెంట్ జి. రవి, నాయకులు నాగయ్య, నాగరాజు, కేబుల్ సాయి, బాబ్జి, శివ, మోహన్ మరియు టీం పట్వారీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.