Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాలి -బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య.

ముద్ర, మోత్కూర్:
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి తమ మేని ఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని యూనియన్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి,ఎలక్ట్రికల్ అద్దె బస్సులు ఆర్టీసీ పరిధిలోకి తీసుక వస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వారిని మోసం చేయడం తగదని అన్నారు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారికి చాలీచాలని జీతాలతో వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రభుత్వాలు వారి న్యాయమైన ప్రధానమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చి సామాన్య ప్రజల జీవితాలపై సమ్మె ప్రభావం
లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.