Take a fresh look at your lifestyle.

కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై అవగాహన ర్యాలీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాలానుగుణ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత అంశాలపై మంగళవారం దిలావర్ పూర్ లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలోలో భాగంగా వర్షాకాలం కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తత, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత, తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిపిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉంటూ, శుభ్రతను పాటించాలని తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలో ఎంపీడీవో అరుణ రాణి, ఎంపీఓ, మహిళా సంఘాలు, ఆశాలు, ఎఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.