- జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంతో పాటు గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తానని, అభివృద్ది చేసి ప్రజల రుణం తీర్చుకుంటా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో రూ. 1.80 కోట్లు, చర్లపల్లి గ్రామంలో 15 లక్షలతో మోర పల్లి గ్రామంలో 45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, జగిత్యాల అర్బన్ మండలం అంబర్ పేట్ గ్రామంలో 25 లక్షల నిధులతో, హస్నాబాద్ గ్రామంలో 30 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. అనంతరం హస్నాబాద్ గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతారం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి,లబ్ధిదారులతో మాట్లాడి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, పేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ చేయటం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటానికి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకే విడతలో 24 వేల కోట్ల రుణ మాఫీ దేశంలోనే ఎక్కడా లేదు. రైతు భరోసా తో రైతులు అందరికీ లబ్ది చేకురిందని,రాష్ట్రంలో విద్య వైద్యం వ్యవసాయం నికి పెద్ద పీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారులు రామ్మోహన్, శ్రీనివాస్, ఎంపిడిఓలు విజయ లక్ష్మీ, రమాదేవి, ఎంపిఓ వాసవి, రవి బాబు, డిఇ మిలింద్, నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, మహేశ్వర్ రావు, నారాయణ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, దుమల రాజ్ కుమార్, కట్ట రాజేందర్, దమ్మ మల్లారెడ్డి, బోనగిరి నారాయణ, గోడిసెల గంగాధర్, దుమాల తిరుపతి, లక్ష్మణ్ రావు, వెంకటేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.