- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థుల నైపుణ్యం అనుగుణంగా ఉపాధ్యాయులు బోధించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా తెలుగు పండిట్ ఉపాధ్యాయుల 5 రోజుల వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని విధముగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను పెంచాలని, బీద మధ్యతరగతి ప్రజలు చదివే పిల్లలకు ప్రైవేట్ కి దీటుగా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికత నేర్చుకొని,విద్య బోధన చేయాలని, గురువులు విద్య తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలని, చెడు అలవాట్ల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారనీ, అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం, సైన్స్ ల్యాబ్ లు మంజూరు చేయటం జరిగింది అన్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. రాజకీయాల్లోకి రాకముందే జగిత్యాల నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు స్వచంద సంస్థ ద్వారా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము నాయక్, మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, కోర్సు డైరెక్టర్ బాసిత్, ఎస్ ఓ రాజేష్, ఎస్ ఆర్ పీ మనోహర్ చారి, ఉపాధ్యాయ సంఘం నాయకులు నరేందర్ రావు, ప్రసాద్ రావు, డిఆర్ పీ శివ ప్రసాద్, ఉపాధ్యాయులు కటకం నరేందర్, సూర్య నారాయణ,సంద రాజేందర్, గంగన్న, బాపు, రహీం, సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.
