ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ఏరియా 1 జియం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం గుర్తింపు సంఘం ప్రతినిధులతో ఆర్జీ.1 వివిధ విభాగాల అధికారులతో ఆర్జీ. 1 జిఎం డి.లలిత్ కుమార్ అధ్యక్షతన ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ గత నెలలో జరిగిన నిర్మాణాత్మక సామావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని పరిష్కారం అయ్యాయని మరికొన్ని కావాల్సి ఉన్నదని అన్నింటికి సానుకుల వాతావరణంలో పరిష్కారం జరుగుతాయని తెలిపారు.ఈ సమావేశంలో గుర్తింపు సంఘం ప్రతినిధులు వివిధ సమస్యలు మీద చర్చించారు. ఆర్జీ1 ఏరియా లెవెల్ స్ట్రక్చర్ కమిటీ ఎజెండా లోని కొన్ని ప్రాదాన అంశాలను పేర్కొన్నారు.జిడికె వన్ ఇంక్లయిన్ లో మ్యాన్ రైడింగ్ చైర్ సిస్టం సర్ఫేస్ నుండి 12 లెవెల్ వరకు ఏర్పాటు చేయాలని గతంలో కోరడం జరిగింది,కానీ యాజమాన్యం కొంతవరకు పనులు చేసి నిలిపివేశారు.దీని ఏర్పాటు కోసం గనిలో టన్నలు కూడా కొట్టడం జరిగింది.మళ్లీ పనులు ప్రారంభించి మ్యాన్ రైడింగ్ చైర్స్ సిస్టం ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.ఆర్జీ వన్ లో ఉన్న అన్ని క్యాంటీన్ లలో ఉన్న చపాతి మెషీన్ లు గత ఆరు,ఏడు సంవత్సరాల క్రితం సింగరేణి కంపెనీ లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చపాతి మిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది.కానీ అట్టి మిషన్లను వాడకుండా ఏ కారణం చేతనో పక్కకు పెట్టినారు. వాటిని వాడకలోకి తీసుకు వచ్చేందుకు దానికి సంబంధించిన కంపెనీ ద్వారా మెకానిక్ ను రప్పించి అట్టి మిషన్లను వాడే విధంగా చర్యలు తీసుకొని, కార్మికులకు క్యాంటీన్లో టిఫిన్ సౌకర్యం కల్పించాలి.జిడికె ఓసిపి 5 లో బ్లాస్టింగ్ సెక్షన్ లో ఎక్స్ ప్లోజివ్ ను ట్రాన్స్పోర్ట్ చేసి వ్యాన్ ను 3 ఒకటి ఏర్పాటు చేయాలి.అదేవిధంగా కార్మికులను పని స్థలాల్లోకి తీసుకువెళ్లేందుకు క్యాంపర్ వెహికల్ ను ఏర్పాటు చేయాలి.ఆర్జీవన్ జీయం ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్లో చాలామంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు కాలనీవాసులు ఉదయం,సాయంత్రం సమయాల్లో వాకింగ్,వివిధ రకాలఎక్సర్సైజులు చేసేందుకు వస్తున్నారు. వీరికి అక్కడ ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేసి వారికి సౌకర్యం కల్పించగలరు.ఆర్జీ వన్ ఏరియా లో ఉన్న గనులలో బిట్ షార్పనర్ లకు డస్ట్ అలవెన్స్ చెల్లించడం లేదు,వారికి డస్ట్ అలవెన్స్ చెల్లించేందుకు చర్యలు తీసుకొనగలరు.ఆర్జీ వన్ ఏరియా లో సింగరేణి హాస్పిటల్ లో రేడియాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం మూలంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన అట్టి మిషన్ వృధాగా పడి ఉన్నది.రేడియాలజిస్టు లేకపోవడం మూలంగా హాస్పటల్ కు వచ్చే రోగులకు స్కానింగ్ పరీక్షల కోసం బయటికి వెళ్లి చేయించుకోవడం వల్ల వారికి ఆర్థిక భారం పడుతుంది.అదే విధంగా సింగరేణి సంస్థకు కూడా ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కనుక వెంటనే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషను వినియోగంలోకి తెచ్చేందుకు రోగులకు స్కానింగ్ పరీక్షలు చేసేందుకు డాక్టర్ను వెంటనే నియమించాలని, లేదంటే ఔట్సోర్సింగ్ ద్వారా నైనా రేడియాలజిస్టు డాక్టర్ ను నియమించేవిధంగా చర్యలు తీసుకోవాలి.
ఆర్జీవన్ ఏరియాలో రెండు స్విమ్మింగ్ పూల్ లు ఉన్నవి.ఒకటి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో,రెండోది గాంధీనగర్ లో ఉన్నవి.ఇట్టి స్విమ్మింగ్ పూల్ లకు నీళ్లు సరిపోక పోవడం వల్ల గతంలో రెండు బోర్లు మంజూరు చేయడం జరిగింది కానీ ఇంతవరకు మంజురైన బోర్లు వేయలేదు. దీనివల్ల స్విమ్మింగ్ ఫూల్ లో నీళ్లు లేక కార్మికులు,వారి కుటుంబాలు ఈత నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.వెంటనే మంజూరైన బోర్లు వేసి స్విమ్మింగ్ పూల్ లకు నీటి సౌకర్యం కల్పించాలి.జిడికె 11 ఇంక్లైన్ లో సపోర్ట్ మెన్ ముఖద్దం, లైన్మెన్ ముఖద్దం,టెండాల్ మొఖద్ధం పోస్టులు ఖాళీగా ఉన్నవి.వాటిని భర్తీ చేయాలి.ఏరియా వర్క్ షాప్ లో ఎలక్ట్రిషన్లు,ఫిట్టర్లు చాలా తక్కువగా ఉన్నారు,కాబట్టి వాటిని భర్తీ చేయగలరు.జిడికె టూ ఇంక్లైన్ లో ఓవర్ మెన్ రూములలో కంప్యూటర్లు, కూలర్లు,పర్నిచర్ ను ఏర్పాటు, వేసవికాలంలో ఎండలుఎక్కువగా ఉన్నందున సెక్యూరిటీ విభాగంలో అన్ని పోస్టుల వద్ద పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేసి, చల్లని త్రాగు నీటిని ఏర్పాటు చేయాలని పలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, బ్రాంచి సెక్రటరీ అరెల్లి పోశం,రంగు శ్రీనివాస్, యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, డిజియం పర్సనల్ కిరణ్ బాబు,అధికారులు డివి రావు,చంద్ర శేఖర్,రమేష్, కిరణ్ రాజ్ కుమార్,జితేందర్ సింగ్,వర ప్రసాద్,శ్రీనివాస్,రవీందర్ రెడ్డి, హన్మంత రావు,రాజన్న, ఎఐటియుసి నాయకులు మదమ మహేష్,వెంకట రెడ్డి, మల్లిఖార్జున్,అశోక్,సిద్దమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.