Take a fresh look at your lifestyle.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలి

  • జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పోటీలో ఉండేందుకు ఆశా బావులు సిద్ధంగా ఉండాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లూరి ఆచారన్నారు. గురువారం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు నరేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి హాజరై మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కార్యకర్తలు నాయకులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని కాంగ్రెస్ పాలనపై తిరగబడడానికి ప్రజల సిద్ధంగా ఉన్నరాన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తే ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు. సమావేశానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దుర్గాప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, బండెల రామచంద్రారెడ్డి,జిల్లా కార్యదర్శి నర్సిరెడ్డి, జిల్లా కాన్సిల్ సభ్యులు కిష్టారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్యాంసుందర్, నాయకులు సురేందర్ గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీశైలం, శ్రీనివాసులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.