Take a fresh look at your lifestyle.

జోగులాంబ గద్వాల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపిక

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా మంగళవారం గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో అండర్-12, అండర్-14, అండర్-16 కేటగిరీలలో ప్రతి విభాగం నుండి ప్రాథమికంగా 25 మందిని ఎంపిక చేసినట్లు
జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, సెక్రటరీ శ్రీనివాసులు, మరియు కోచ్ లు తెలిపారు. వీరికి అంతర్గత మ్యాచ్‌లు నిర్వహించి, చివరికి ఒక్కో విభాగం నుండి 18 మందిని తుది జట్లుగా (Probables) ఎంపిక చేయనున్నారు.ఇలా ఎంపికైన జట్లకు ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని, అక్కడ కనబరిచే ప్రతిభ ఆధారంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తామని అసోసియేషన్ తెలిపింది.నెల రోజుల పాటు సాగే ఈ క్యాంప్‌లో పిల్లలకు క్రికెట్ మెలకువలు నేర్పించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.