ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టుకు కాలేశ్వరం నీళ్లు వస్తున్నాయంటే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పుణ్యమే అని బి ఆర్ ఎస్ భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు అన్నారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలో మాజీ సర్పంచ్ ఈర్ల కృష్ణ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లమస్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గౌస్ నగర్ గ్రామంలో కెనాల్ వద్ద నీళ్లు ప్రవహిస్తున్న సందర్భంగా గ్రామ రైతులతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు కోసం బస్వాపురం ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేశారని గ్రామ ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కంచి మల్లయ్య, గ్రామ మాజీ సర్పంచ్ ఈర్ల కృష్ణ, మాజీ సర్పంచ్ పుట్ట అరుణ వీరేష్ యాదవ్, సర్పంచ్ తోటకూరి శంకరయ్య, ఉప సర్పంచ్ ఏ. బాల మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ సైరెడ్డి,పోసి రెడ్డి, ఎలిమినేటి పాపిరెడ్డి, నల్లమాస్ చంద్రయ్య, భూషబోయిన సిద్ధులు యాదయ్, నలమస్ కుమార్ గౌడ్, తోటకూరి పరమేష్, గడ్డం సందుల వెంకటేష్, హరినాథ్ రెడ్డి, జనగాం మహేష్, వెంకటేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.