Take a fresh look at your lifestyle.

తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

 

 

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ ఆర్థిక సహాయం సహాయం

ముద్ర… తుంగతుర్తి….
తుంగతుర్తి నియోజకవర్గ మాజీశాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు, ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి వెంకన్న ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మృతుని కుటుంబ సభ్యులకు 10000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మండల పరిధిలోని గానుబండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బత్తుల శివ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య , బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాముల గౌడ్, తడకమళ్ళ రవికుమార్, గోపగాని రమేష్, మల్లెపాక రాములు, గడ్డం సోమేష్ , జలంధర్, గునిగంటి సంతోష్, గుడిపాటి వీరయ్య, యాకూబ్, బొజ్జ సాయి కిరణ్ కొండగడుపుల వెంకటేష్, గోపగాని వెంకన్న, రామనర్సు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.