భూ తగాధాలు కారణమని తెలిపిన గ్రామస్తులు.
మోత్కూరు ముద్ర న్యూస్:
వదిన గొంతు కోసి మరిది పరారైన సంఘటన మంగళవారం పాలడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పాలడుగు గ్రామానికి చెందిన బొంత లక్ష్మి భర్త నర్సింహ సుమారు ఐదు నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా,ఆమె వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుందని తెలిపారు.3 ఎకరాలు అక్రమంగా పట్టా చేసుకుందని ఆమె మరిది అశోక్ కు ఆమెకు కొద్దిరోజులుగా తగాదా నడుస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీ భర్త నర్సింహ ఉన్నప్పుడు కూడా భూ తగాధ విషయాలలో అన్నదమ్ముల కుటుంబాలు దాడులు చేసుకున్నట్లు, కేసు కూడా నడుస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే లక్ష్మి వ్యవసాయ బావి దగ్గరికి వెళ్తున్న క్రమంలో దారి కాసి అశోక్ చెల్లె కొడుకులతో కలిసి గొంతు కోసి పరారైనట్లు తెలిపారు. ఆమెకు రక్తస్రావం అవుతుండడంతో ప్రాథమిక చికిత్స నిర్వహించి 108 అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు . ఈ ఘటనపై బాధితురాలు సోదరి చంద్రమ్మ ఇచ్చిన మేరకు మోత్కూరు సిఐ సి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.