ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన జిల్లా కలెక్టర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థిని , విద్యార్ధులు అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాక్షించారు.
ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసి నూరు శాతం ఫలితాలు సాధించి జిల్లాకు , తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు.