Take a fresh look at your lifestyle.

మరిన్ని శాఖలతో సుధా బ్యాంకు విస్తరణ

  • పెద్దిరెడ్డి గణేష్ మేనేజింగ్ డైరెక్టర్.

సూర్యాపేట ముద్ర ప్రతినిధి: స్థానిక త్రివేణి గార్డెన్స్ ఏసీ ఫంక్షన్ హాల్ లో సుధా బ్యాంక్ 26వ వార్షిక సర్వసభ సమావేశం జరిగింది. గత 26 సంవత్సరాలుగా సుధా బ్యాంక్ లాభాలను వాటాదారులకు డివిడెంట్ రూపంగా పంచుతూ సమాజ పురోభివృద్ధికి తమ వంతు బాధ్యత వహిస్తుందని బ్యాంకు వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ తెలియజేశారు. గత సంవత్సరానికి 7 బ్రాంచులుగా ఉన్న సుధా బ్యాంక్ ,ఈ ఆర్థిక సంవత్సరంలో హయత్ నగర్ చౌటుప్పల్ లో మరో రెండు బ్రాంచ్ లు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్లు ,రాబోయే సంవత్సరంలో మరో మూడు బ్రాంచీలు ఏర్పాటు చేయబోతున్నట్లు సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ తెలియజేశారు. ఈ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశానికి బ్యాంక్ చైర్మన్ మీలామహదేవ్ అధ్యక్షత వహించి వాటాదారులకు స్వాగతం తెలియజేశారు. వార్షిక పద్దులను మేనేజింగ్ డైరెక్టర్ ప్రవేశపెట్టి వాటాదారులచే ఆమోదింపజేశాడు. చైర్మన్ నివేదికను బ్యాంక్ డైరెక్టర్ కక్కిరేణి చంద్రశేఖర్ సమర్పించగా, బ్యాంకు వైస్ చైర్మన్ శ్రీమతి పొనుగోటి నిర్మల మహిళలు తమ సొంత ప్రణాళికలతో బ్యాంకింగ్ సౌకర్యాలను అందిపుచ్చుకొని సమాజంలో మరింత ముందుకు నడవాలని తెలిపారు. ఈ సంవత్సరానికి వచ్చిన ఒక కోటి 66 లక్షల(1,66,08,510) లాభాన్ని వివిధ రిజర్వులకు మళ్ళించగా వాటాదారులకు 15% డివిడెంట్ పంచుతున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ తెలియజేశారు. తన 28 సంవత్సరాల సుదీర్ఘ పనివిధానం తో సుధా బ్యాంక్ ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థల మెప్పు పొంది ఇటీవల ఐ ఎస్ ఓ .(I S O)సర్టిఫికెట్ పొందినట్లుగా తెలియజేశారు. ఈ సమావేశంలో అనంతల ప్రభాకర్ , కామ్ లేకర్ శంకర్ లాల్, ఏపూరి శ్రవణ్ కుమార్, మీలా సందీప్ కుమార్, కక్కిరేణి చంద్రశేఖర్, బాణావత్ సుజాత ,బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ స్వామి వెంకటేశ్వర్లు డైరెక్టర్లు, ఇరుకుళ్ళ చెన్నకేశవ రావు, వెంపటి వెంకటరమణ, పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రముఖ నాయకులు పెద్దిరెడ్డి రాజా ,ప్రముఖ వర్తకులు తోట శ్యాంప్రసాద్, సుధా బ్యాంకు సిబ్బంది, పుర ప్రముఖులు వాటాదారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.