Take a fresh look at your lifestyle.

నూతన కార్యవర్గం కాలనీ అభివృద్ధికి కృషి చేయాలి

  • పీయేసీ ఛైర్మెన్ అరికపూడి గాంధీ.

మాదాపూర్, ముద్ర విలేఖరి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువతో సన్మానించి,అభినదించిన ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని,నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాలో అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ ,ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చైర్మన్ గాంధీ తెలియచేసారు. జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరలోనే పూర్తి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకై పెద్ద పీట వేస్తానని, కాలనీ అసోసియేషన్ భాగస్వామ్యం తో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రావు,కార్యవర్గ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, కోటి రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అంజయ్యా, సూర్యనారాయణ, బసవేశ్వరావు, జీవన్, సీతాకుమారి, మంజుల,జగదీశ్వర్ రావు, లక్ష్మారెడ్డి,మోహన్ రెడ్డి, శైలేష్ రెడ్డి,శ్రీధరాచారి, వెంకట్రావు, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.