ముద్ర, వికారాబాద్ బ్యూరో: ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం అందాలనే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్ లు ఆహార భద్రతపై వివిధ సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహాల్లో, పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఆహార భద్రత నియమాలను పాటించాలన్నారు. అంగన్వాడి, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో అందిస్తున్న భోజనాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లో, పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న హోటళ్లకు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భోజన నమూనాలను సేకరించి నాణ్యతలను పరిశీలించాలని వారు అధికారులు సూచించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాడు కాకుండా పరిసరాలు పారిశుధ్యంగా ఉండేలా ఆహార అభద్రత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిపిఓ జయసుధ, డిఇఓ రేణుకాదేవి, డిడబ్ల్యుఓ కృష్ణవేణి, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, ఆహార భద్రత అధికారి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.