- ఆదిలాబాద్ జిల్లా కు చెందిన (అస్సాం రైఫిల్స్) జవాన్ మృతి.
ముద్ర: విలేకరి ఇచ్చోడ/బజార్ హథ్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం, వర్త మన్నూరు గ్రామానికి చెందిన, నలువాల ఆకాష్ (24) అస్సాం రైపెల్స్ జీడి విభాగంలో జవానుగా విధులు నిర్వహిస్తూ (సోమవారం )కొద్దిసేపటి క్రితం మృతి చెందారు.పేద కుటుంబం నుంచి దేశ సేవకు కఠోరమైన శిక్షణను పొంది,, అనతి కాలంలో చనిపోవడం వలన వారి నిరుపేదకుటుంబం బోరుమంది.అమాయకమైనటువంటి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్న దృశ్యం అందరినీ కలిచివేస్తుంది.. జవాన్ మరణంతో వర్త మన్నూర్ గ్రామంలో తీవ్ర విచ్చదచాయలు నెలకొంది. జవాన్ మరణం పట్ల గ్రామ మాజీ సర్పంచ్ లు అల్లం రాజు, గుంజాల భాస్కర్ రెడ్డి లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.