ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నూతనంగా బీఎస్సీ ఫిషరీస్ కోర్సుకు అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. జిల్లాలో తొలిసారిగా ఈ కోర్సు ప్రారంభం కావడం ఆనందకర విషయమని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు.
డిగ్రీ అడ్మిషన్ల రెండవ విడత ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రవేశాలు పొందవచ్చని చెప్పారు.
కళాశాలలో ఇప్పటికే బీఎస్సీ లైఫ్ సైన్సెస్, డైరీ టెక్నాలజీ కోర్సులతో పాటు ఎంపీసీ, ఎంపీసీఎస్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు తమ ఆసక్తి మేరకు కోర్సులను ఎంపిక చేసుకోవాలని ప్రిన్సిపాల్ మదన్ మోహన్ కోరారు.