ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న మాతా నిమిషాంబిక అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండో రోజు బాల త్రిపురసుందర దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహిస్తున్నారు.


ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకుడు ఉమాకాంత శర్మ భక్తులతో ప్రత్యేక పూజలు చేయించారు. బాల త్రిపురసుందర దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే, సత్సంతానం, విజ్ఞానం, సమృద్ధిగా మనశ్శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. కార్యక్రమంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఏర్పాట్లు చేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.