ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
వాసవిమాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం హర్షనీయమని సిద్దిపేట పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నేతి కైలాసం అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 26 వ తేదీన వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లొని హోసింగ్ బోర్డు లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతామాన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అన్నప్రసాద విచారణ కార్యక్రమం చేపడతామని, ఈ కార్యక్రమంలో వైశ్యలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు మధుసూదన్, సురేష్, పప్పు రవి, నాగరాజు పలువురు పాల్గొన్నారు.