Take a fresh look at your lifestyle.

మహిళల అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

 

 

మహిళా బిల్లుకు అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్‌పై బీజేపీ మండిపాటు

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:

మహిళలు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలలో ముందుండాలనే ఉద్దేశంతోటి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం సిగ్గుచేటని సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. సుమారు 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమం కోసం ఏనాడు పాటుపడకపోగా రాజ్యసభలో మహిళా బిల్లు చేసి లోక్సభలో వీగిపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని ఆమె మండిపడ్డారు.  కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతుందని ఆమె తెలిపారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నారీశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడారు. పుట్టబోయే బిడ్డను పురిటిలోనే తుంచి వేసినట్టు ఇండి కూటమి మహిళా బిల్లును పాస్ కాకుండా అడ్డుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆమె విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు వ్యతిరేకమని కాంగ్రెస్ కూటమి ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేసినప్పటికీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ను రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ వాయువులను ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. పేద మహిళలకు జన్ధన్ ఖాతాలను తెరిచి, ఆడపిల్లలు జన్మిస్తే పేటి పడావో బేటి బచావో, సుకన్య సమృద్ధి యోజన పథకాలను తీసుకువచ్చి వారికి అండగా నిలిచిన ఘనత ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు శంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఇర్రి ఉమా రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాసాంగారి వెంకట్ , సంతోష్, తొడుపునూరి వెంకటేశం పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.