- ఈనెల 6, 9 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్యక్రమం.
- గతంలో కంటే 42 క్యూలైన్లు ఏర్పాటు.
- మత్య్సశాఖ ద్వారా లక్షకు పైగా చేప పిల్లల పంపిణీ.
- రాష్ట్ర ఫిషరీష్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారని రాష్ట్ర పిషరీష్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ వెల్లడించారు. వివిధ సంస్థల సహకారంతో ప్రత్యేక ప్రణాళిక మేరకు గతంలో కంటే ఈసారి క్యూలైన్లను 42కు పెంచామన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో లక్షకు పైగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు గాంధీభవన్‌లో మీడియాతో సాయి కుమార్ మాట్లాడారు.. గత 175 ఏళ్ళుగా ఉబ్బసంతో బాధపడుతున్న వారికి చేపమందు ప్రసాదం బత్తిని కుటుంబ సభ్యులు అందజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. చేపమందు ప్రసాదం కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. ఏ కోశానా సమస్యలు తలెత్తకుండా చేపమందు ప్రసాదం పంపిణీ చేసేలా పూర్తి ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ఎంతమంది వచ్చినా చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ప్రత్యేకించి బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి చేప మందు కోసం వచ్చేవారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. చేప మందు ప్రసాదం కోసం సమయానుసారంగా ప్రత్యేక టోకెన్లు ఇస్తున్నామని, మీడియా కోసం ప్రత్యేక క్యూలెైన్లు ఏర్పాటు చేశామన్నారు.