Take a fresh look at your lifestyle.

కంపెనీ నిర్మాణం వద్దు -అదనపు కలెక్టర్ కు కామారం సర్పంచ్, గ్రామాస్తుల విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, మెదక్:
టైర్లు కరిగించి వాటి నుంచి ఆయిల్, పౌడర్ తయారీ చేసే కంపెనీని తమ గ్రామంలో నిర్మించవద్దని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం సర్పంచ్ సుజాత సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మెదక్ కలెక్టర్ ముందు నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందచేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న రెండు కంపెనీల వల్ల గ్రామం పూర్తిగా కలుషితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తo చేశారు. సర్వే నెం.103లో నూతనంగా నిర్మించతలపెట్టిన వాహనాల టైర్లను కరిగించి ఆయిల్, పౌడర్ తయారీ కంపెనీ పెట్టడం వలన కామారం గ్రామం పూర్తిగా కలుషితం అవుతుందని తక్షణమే నూతనంగా నిర్మించ తలపెట్టిన కంపెనీని నిలిపవేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో నూతన కంపెనీని నిర్మిస్తే రెండు చెరువులు పూర్తిగా కలుషితమవుతాయని గ్రామస్తులు పేర్కొన్నారు. కలుషిత జలాల వల్ల చేపలు మృత్యువాత పడటంతో పాటు భూగర్భ జలాలుకూడా కలుషితమవుతాయని రైతులు తీవ్ర నష్టం ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.