కూకట్ పల్లి, ముద్ర విలేకరి : ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం విజయానికి సూచికగా ఉచితంగా 10 వేల పండ్ల మొక్కల పంపిణీ, రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కూకట్ పల్లి జనసేన సీనియర్ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అన్నారు. శనివారం ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం విజయానికి సూచికగా వాసుదేవుడు మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేపీహెచ్ బి కాలనీలో పది వేల పండ్ల మొక్కల పంపిణీ, రక్తదాన శిబిరానికి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను పెంచడం తప్పనిసరి అన్నారు.ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపడితే కాలుష్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చునన్నారు. వాసుదేవుడు మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జస్టీస్ భవానీ ప్రసాద్, మిరియాల రాఘవరావు, వాకాడ తిరుమలరావు, బసవాల శ్రీనివాస్, అంధే శ్రీరామ్ మూర్తి,యర్రా ఆనందరావు,దాసరి రంగారావు, మోటెపల్లి భరత్, హెచ్ మూర్తి, వుచా రాంబాబు,జనసేన నాయకులు, వీరమహిళలు, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.