- ఎన్ఎఫ్సిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డి ఏ ఈ-1 డి ఐ జి ప్రణీత్ చంద్ర, ఎన్ ఎఫ్ సి డాక్టర్ కోమల్కాపూర్.
కుషాయిగూడ , ముద్ర విలేఖరి: రక్తదానంతో సమాజంలో మానవతా విలువలు పెంపొందుతాయని డి ఏ ఈ-1 సిఐఎస్ఎఫ్ డి ఐ జి ప్రణీత్ చంద్ర, ఎన్ ఎఫ్ సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కోమల్ కపూర్ లు పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎఫ్సీ, తల సేమియా, సికిల్ సెల్ సొసైటీ సంయుక్త సహకారంతో శనివారం సిఐఎస్ఎఫ్ యూనిట్ ఎన్ఎఫ్సీ హైదరాబాద్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపద సమయంలో.. రక్తం ఎంతో అవసరం అవుతుందని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు, ఎన్ఎఫ్సీ ఉద్యోగ కార్మికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ యూనిట్ ఎన్ ఎఫ్ సి కమాండెంట్ రాహుల్ సింగ్ గౌతం, ఎన్ఎఫ్సీ, సిఐఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.