Take a fresh look at your lifestyle.

జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు పేరుతీసుకోరావాలి 

  • రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. వేణుగోపాల్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బాస్కెట్ బాల్ లో నిత్యం ప్రాక్టీస్ చేస్తూ జాతీయ స్థాయిలో పాల్గొని జగిత్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గత నెల రోజులుగా జగిత్యాల బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని  ఓల్డ్ హై స్కూలులో కోచ్ విశ్వ ప్రసాద్ శిక్షణలో కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో క్రీడాకారులకు డబుల్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలుగా నిలిచిన జట్లకు డా. వేణుగోపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు.మొదటి స్థానంలో  శ్రీ చరణ్ జట్టు, రెండవ స్థానంలో  శ్రీరామ్ జట్టు, మూడవ స్థానంలో నాయక్ జట్లు నిలిచాయి.ఈకార్యక్రమంలో పీడీ లు నిరంజన్, రవికుమార్, కృష్ణప్రసాద్, అజయ్, వేణు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.