Take a fresh look at your lifestyle.

ఆర్థిక సమానత్వం ద్వారానే కులనిర్మూలన జరుగుతుంది…సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫురితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాడుదాం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భూమి లేని పేదలందరికీ భూపంపిణీ జరిగి, అందరికి ఉపాధి కల్పించినప్పుడే ఆర్ధిక సమానత్వం వస్తుందని ఆర్థిక సమానత్వం కుల నిర్మూలన జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ” భారత రాజ్యాంగం – సామాజిక న్యాయం ” అనే అంశంపై సదస్సు నిర్వహించగా ఈ సదస్సు ముఖ్య అతిథిగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ నాటి రిజర్వేషన్లు పేదలకు కాస్తో కూస్తో విద్యా, వైద్యం, ఉపాధికి ఉపయోగపడుతుందని కానీ 1991 నుండి నూతన ఆర్థిక విధానాలు భారతదేశంలో అమలు చేపట్టిన నాటినుండి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం కూడా రాను రాను ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తేవాలని చూస్తుందని దీనికి వ్యతిరేకంగా వామపక్షవాదులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు పార్టీ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షత వహించగా జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మధ్యపురం బాల్ నర్సింహ, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, శాఖ కార్యదర్శులు ఏదునూరి వెంకటేష్, మచ్చ భాస్కర్, కొల్లూరి సిద్ధిరాజు, అనాజిపురం గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్ , మండల నాయకులు నరాల చంద్రయ్య, దయ్యాల మల్లెష్, బొల్లెపల్లి స్వామి, బండి శ్రీను, పాక జహంగీర్, మధు, మాణిక్యం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.