Take a fresh look at your lifestyle.

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి -తుంగతుర్తి రామాలయ పూజారి కాటూరి రామాచార్యులు

 

ముద్ర ,తుంగతుర్తి:

ఈనెల 9న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రామాలయం ప్రాంగణంలో జరిగే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని రామాలయ అర్చకుడు కాటూరి రామాచార్యులు అన్నారు. మంగళవారం తుంగతుర్తిలోని రామాలయంలో సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇట్టి సమ్మేళనానికి ధర్మరక్షణ పీఠం జగిత్యాల శ్రీశ్రీశ్రీ డాక్టర్ లక్ష్మీ నారాయణ స్వామిజీ హాజరవుతారని, పార్టీలకు అతీతంగా అందరూ హాజరుకావాలన్నారు. ముఖ్యంగా శివస్వాములు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు, దుర్గామాత స్వాములు, హిందూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ భక్తులు గోపగాని రమేష్ గౌడ్, పులిపంపుల సైదులు గౌడ్, ఆలయ చైర్మన్ ఎనగందుల సంజీవ, కాసం మల్లయ్య, తల్లాడ కేదారి, అంబటి రమేష్, పెండెం మధుసూదన్, బత్తుల శ్రీను, అంబటి రాములు, ఎనగందుల గిరి, గూడూరి శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.