Take a fresh look at your lifestyle.

త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం

  • రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవబోతున్నారు.
  • కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది.
  • ఇరు పార్టీల మధ్య విలీనం, అధికార మార్పిడే మిగిలి ఉంది.
  • కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై అనుమానాలున్నాయి.
  • బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్న హరీశ్ రావు ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలోనూ పని చేస్తానని చెబుతున్నారని విమర్శించారు.ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు.బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని కీలక వ్యాఖ్యలుచేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మధ్య రాజీ కుదిరిందని ఆరోపించారు.ఇరు పార్టీల మధ్య విలీనం, అధికార మార్పిడే మిగిలి ఉందన్నారు.తెలంగాణలో సీఎం మార్పు ఖాయం అన్నారు.రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవబోతున్నారని చెప్పారు.ఇందులో భాగంగానే ఇప్పటికే కవితకు న్యాయసలహా అందిస్తున్న ప్రముఖ న్యాయవాదిని కాంగ్రెస్ ఇప్పటికే చట్టసభల్లో కూర్చోబెట్టిందన్నారు.సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, తాను మాట నిలబెట్టుకోవాల్సి ఉందని కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో అన్నారన్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోని నిర్ణయాలపై విచారణ మందకొడిగా సాగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుత కాంగ్రెస్ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో జరగకపోవడంతో నిజమైన అర్హులకు ప్రభుత్వ ఫలాలు చేరడం లేదని ఆరోపించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని అతితక్కువ సమయంలో అనుకున్న లక్ష్యం నెరవేర్చడంలో, ప్రపంచంలో పాక్ ను ఏకాకిని చేయడంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారన్నారు.ఉగ్రవాదంపై పోరాటంలో ఓ వైపు ప్రపంచ దేశాలు భారత్ కు బాసటగా నిలుస్తుంటే మరో వైపు భారత్ దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాయని మండిపడ్డారు.ఉగ్రవాదాన్ని అణచివేయాలని, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కమ్యూనిస్టు పార్టీలు తీర్మానం చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.

Leave A Reply

Your email address will not be published.