ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్ ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ చేపట్టారు. భక్తుల చేత 20 రోజుల హుండీ ఆదాయం రూ.1,52,01,420 రూపాయలు వచ్చాయి. స్వామివారికి మిశ్రమ బంగారం 54 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 700 గ్రాములు,విదేశీ కరెన్సీ అమెరికా248 డాలర్లు, ఆస్ట్రేలియా 55 డాలర్లు, ఇంగ్లాండ్ 15 పౌండ్స్, యూఏఈ 95 దిరమ్స్, కెనడా 10 డాలర్స్, నేపాల్ 10, న్యూజిలాండ్ 10 డాలర్స్, సింగపూర్ 27 థాయిలాండ్ 220 మలేషియా 1, టాంజానియా 20,000 సౌదీ అరేబియన్ 50 న్యూజిలాండ్ 20 యూరో 10 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.