Take a fresh look at your lifestyle.

ఇంటర్ ఫలితాల్లో ‘ రిషి ‘ ప్రభంజనం

 
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………..
ప్రతి ఎడాది ఇంటర్ పరీక్ష ల్లో రిషి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు.ఈ ఏడాది విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మహబూబ్ నగర్ లోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘రిషి’ కళాశాల విద్యార్థులు ప్రతిభ లో మాకెవ్వరు సాటిలేరని నిరూపిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ ఫలితాలు వారి ఖాతాల్లో వేసుకున్నారు.
………………………………….
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో…
…………………………………….
ఎంపీసీ విభాగం నుంచి
యు. వినయ్ కుమార్ గౌడ్ 468/470 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. వేణుమాధవ్ రెడ్డి, జి. అంకిత్, జి. మాధురి, ఎ. కార్తీక్ రెడ్డి, సృజన విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు. బైపీసీ విభాగం నుంచి
కె. అక్షిత, తానియా మహమూద్ 438/440 మార్కులతో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. శ్రావణి, భవిత, సౌమ్య, సురేంద్ర చక్రవర్తి, ఆయేషా జువా, అఖిల, అశ్లేష యాదవ్, మౌనిక, రిషిత, నాగ సాయి వైష్ణవి, మైవిన్, కె. మీనాక్షి సహా 14 మంది విద్యార్థులు 437 మార్కులు సాధించారు.
…………………………………
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో..
…………………………………
ఎంపీసీ విభాగం నుంచి

ఎం. భావన 995/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. మొహమ్మద్ అశ్వాక్ అహ్మద్, సయ్యద్ మిస్బావుద్దిన్, శ్రీవిద్య 992 మార్కులు సాధించగా, కోటేశ్వర్ 990 మార్కులు సాధించారు.బైపిసి విభాగం నుంచి
అఫ్సా మోయిన్, పి. గాయత్రి, అమూల్య 994/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలబడ్డారు. ఫారియా, ఫాతిమా కదీర్ 993 మార్కులు సాధించగా, నందిని రెడ్డి, వైశాలి 992 మార్కులు, శ్రీనిధి 991, సృజన, సుమేరా బేగం 990 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్‌పర్సన్ చంద్రకళ వెంకట్, డైరెక్టర్ వెంకటయ్య, డీన్ భూపాల్ రెడ్డి, అకాడమిక్ డీన్ కళ్యాణ్ బాబు, ప్రిన్సిపాల్స్ రాఘవేంద్రరావు, వెంకటరత్నం, ప్రసన్నకుమారి విద్యార్థులను అభినందించారు.
కళాశాల డైరెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ, తమ సంస్థలో కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నామని, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించామని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.