ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణం లోని 12 వార్డ్ లో పగిడిపల్లిలో గత 15 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సర్వీస్ రోడ్డును కడమంచి రాములు ఇంటి దగ్గర ఆగిన రోడ్ పనులకి సహకరించాలని వారి కుటుంబ సభ్యులతో కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వెంకటేష్, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు మాట్లాడి అందరూ కలిసి సర్వీస్ రోడ్డు క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వార్డ్ కౌన్సిలర్ తోటకూరి విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తానని హమి ఇచ్చారు.