ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచి, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎంపి పటేల్ గూడ, కొంగరకలాన్ గ్రామాల్లో మున్సిపల్ పార్టీ అధ్యక్షులు గౌని బాల్ రాజ్ గౌడ్ అధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, పలు వార్డులలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకమై రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని హక్కులను కాపాడుకోవాలని అన్నారు. రాజ్యాంగం రక్షణ కోసం గ్రామస్థాయి నుండి యువకులు ప్రజలు చైతన్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు భూపతిగల్ల మహిపాల్, పొట్టి ఐలయ్య, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాశం లక్ష్మి పతి గౌడ్, ఈసీ శేఖర్ గౌడ్, మంఖాల దాసు, కొత్తకుర్మ శివకుమార్, కామాండ్ల యాదగిరి, పండాల శంకర్ గౌడ్, అమృత సాగర్, చిలుక రాజు, సిద్దంకి కృష్ణ రెడ్డి, లక్కరాజు ప్రశాంత్, కొత్త ప్రవీణ్ గౌడ్, సాయి తేజ, భారత్ రెడ్డి, బంగరిగల్ల శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.