Take a fresh look at your lifestyle.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

అడ్డగూడూరు/ముద్ర :

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2010-11 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 15 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ ఒక్క దగ్గర కలవడంతో తమ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.