ముద్ర : మల్కాజిగిరి
మేడ్చల్ నియోజకవర్గం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పి & టి కాలనీలో శ్రీభూ, నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ, ధ్వజ స్తంబ ప్రతిష్టామహోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.