Take a fresh look at your lifestyle.

గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా…

ముద్ర : ఆత్మకూర్( ఎం) అపరిస్కృతంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూరల కిష్టయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి 26 వేల వేతనం ఇస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుని అకౌంట్లో జమ చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని, తమ డిమాండ్లను పరిష్కరించని ఎడల సమ్మెకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఇంద్ర పెళ్లి జ్ఞానేశ్వర్, రేగటి శీను వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని రమేష్, కల్వల లక్ష్మయ్య, కొలపాక నరసయ్య, మేడే యాదయ్య, తాళ్లపల్లి నరసయ్య, వేముల లక్ష్మి, లలిత, ఉప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.