Take a fresh look at your lifestyle.

ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే… తస్మాత్!

  • జరిమానా చెల్లించక తప్పదు

  • సీసీ కెమెరాలతో నిఘా

  • ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ

  • బోడుప్పల్ కమిషనర్ శైలజ

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: ఇక నుంచి రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్తవేస్తే.. తప్పనిసరిగా జరిమానా చెల్లించాల్సి వుంటుంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ కెమెరాల సాయంతో నిర్దేశిత ప్రాంతాలలో కాకుండా, వేయకూడని చోట చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తోంది. ఈ సిస్టం ద్వారా శుక్రవారం వేయకూడని చోట చెత్త వేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి.. వారికి రూ.500, రూ.1000 జరిమానా విధించారు. అలాగే వేయకూడని చోట్ల చెత్త వేస్తున్న ఒక వాహనాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ కార్యక్రమములో భాగముగా  చెత్త వేయు ప్రాంతములను  పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి వ్యూహాత్మక ప్రదేశాలలో సెన్సార్ ఆధారిత సి.సి.టీ.వి. కెమెరాలు, ఆటోమేటెడ్ వాయిస్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని  ఏడో డివిజన్ లో శివాలయం రోడ్ లో, 21వ డివిజన్ లోని అయ్యప్ప స్వామి గుడి రోడ్ లో, బంగారు మైసమ్మ గుడి నుంచి చెంగిచెర్ల  వెళ్లే రోడ్ లో ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ నిఘా కెమెరాలు నిరంతరం నిఘా తో  చెత్త వేసే వ్యక్తులను, వాహనముల గుర్తించడానికి వీలుగా సెన్సార్‌లతో అమర్చబడి ఉంటాయి. ఆటోమేటెడ్ వాయిస్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌ తో ముందస్తుగా రికార్డ్ చేయబడిన వాయిస్ ప్రకటనలు హెచ్చరికలను కూడా జారీచేస్తాయి. బోడుప్పల్ కీలక ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యకలాపాల నిమిత్తం, ప్రజల నుంచి వస్తున్న పలు ఫిర్యాదులను అనుసరించి పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్వహించడానికి ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యకలాపాల డ్రైవ్‌ అయిన “ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ కార్యక్రమం”ను చేపడుతున్నారు. ఈ ఇంటెన్సివ్ డ్రైవ్ పరిశుభ్రతను పెంపొందించడం, పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు పారిశుధ్య పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన పెంచడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భముగా కార్పొరేషన్ కమిషనర్ ఎ.శైలజ మాట్లాడుతూ  చెత్త ను  స్వచ్చ వాహనములకు అందచేయాలని ప్రజలకు సూచించారు. స్వచ్చ వాహనముతో ఏదైనా సమస్య ఉన్నచో వార్డ్ సూపర్ వైజర్ ను సంప్రదించవలనని  తెలిపారు. అలాగే నగర  పౌరులు పరిశుభ్రతను కాపాడుకోవాలని, కూడని చోట చెత్త వేయకుండా ఉండాలని హితవు పలికారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమములో శానిటరీ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, సంగీత, వార్డ్ ఆఫీసర్స్, వార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.