Take a fresh look at your lifestyle.

బహిరంగ ప్రదేశాలలో చెత్తవేస్తే క్రిమినల్ చర్యలు 

  • బోడుప్పల్ కార్పొరేషన్ కమిషనర్ శైలజ

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేస్తే భారీ జరిమానాలతో పాటు, మున్సిపల్ చట్టాల మేరకు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బోడుప్పల్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.శైలజ హెచ్చరించారు. మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులు, సిబ్బందితో కలిసి ఆమె సోమవారం కార్పొరేషన్ పరిధిలోని చెత్తవేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో చెత్తను వెంటనే తొలగించి శుభ్రం చేయాలని అధికారులు, సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం (స్పెషల్ శానిటేషన్ డ్రైవ్) నిర్వహించాలన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ శివాలయం రోడ్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా చెత్తను తొలగించారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజానీకం చెత్తను స్వచ్ఛ వాహనాలకు అందించి సహకరించాలని కమిషనర్ సూచించారు. ఇట్టి కార్యక్రమములో శానిటరీ ఇన్ స్పెక్టర్లు శ్రీనివా

Leave A Reply

Your email address will not be published.