Take a fresh look at your lifestyle.

మాదిగ ఉద్యోగులు వేలాదిగా తరలిరండి.. పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

 

ధర్మపురి:

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం జరిగే విధంగా కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సన్మాన సభకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మాదిగ ఉద్యోగులంతా వేలాదిగా తరలి రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

రేపు అనగా శుక్రవారం (తేది 06-03-2026) మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లోని శిల్పకళా వేదికలో తెలంగాణ రాష్ట్ర మాదిగ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారితో పాటు తెలంగాణ రాష్ట్ర మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మాదిగ ఉద్యోగులు వేల సంఖ్యలు తరలివచ్చి ముఖ్యమంత్రి గారి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.