Take a fresh look at your lifestyle.

భారీ మొత్తంలో 4.25 క్వింటాళ్ల క్లోరల్ హైడ్రేట్ పట్టివేత

  • రెండు కార్లు స్వాధీనం, నలుగురి అరెస్టు.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కల్తీ కల్లు తయారీకి వినియోగించే క్లోరోహైడ్రేడ్ తయారీ యూనిట్ ను శనివారం ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ సిబ్బంది కలిసి తయారీ యూనిట్ తో పాటు ఈ యూనిట్లో తయారైన 4.25 క్వింటాళ్ల క్లోరల్ హైడ్రేడ్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 10 లక్షల విలువ చేసే ఒక కేజీ ఆల్ఫా జోలం ను, రెండు కార్లను నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి తమ సత్తా చాటుకున్నారు. నిర్మల్ – బైంసా రహదారిలో చిట్యాల ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో బుర్ర రమేష్ గౌడ్, రామా గౌడ్ కలిసి ఈ యూనిట్ ని ఏర్పాటు చేశారు. యూనిట్ తయారీ కేంద్రంలో శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ గౌడ్, రాజు గౌడ్ లను పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు. ముంబైలోని భీవండి నుండి క్లోరో ద్రవపదార్థాన్ని తీసుకువచ్చి 50 లీటర్లకు తొమ్మిది లీటర్ల నీరును కలిపి గుంతలు తవ్వి చుట్టూ ఐస్ ఏర్పాటు చేసి పది రోజులపాటు అనంతరం గడ్డ కట్టిన తర్వాత దాన్ని క్లోరోహైడ్రేడ్ గా తయారుచేసి కల్తీ కల్లు విక్రయానికి వినియోగిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నలుగురు వ్యక్తులతో పాటు ఐదు సెల్ ఫోన్ లను 17 క్లోరోహైడ్రేడ్ బ్యాగులను కేజీ ఆల్ఫాజోలం ను, రెండు కార్లను స్వాధీనం చేసుకొని నలుగురుని అరెస్ట్ చేసినట్లు ఎస్టిఎఫ్ బి టీం అధికారి ప్రదీప్ రావు తెలిపారు. ఈ దాడిలో టీజీ న్యాబ్ నుంచి రూపేష్, సిఐ రమేష్, పూర్ణేశ్వర్, నిర్మల్ సిఐ రంగస్వామి, టీం ఎస్సై బాలరాజు నితిన్ కౌశిక్ లతో పాటు సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. పట్టుకున్న 425 కేజీల క్లోరోహైడ్రేడ్ విలువ రూ. 10 లక్షలు, రూ. 10 లక్షల విలువ చేసే ఆల్ఫా జోలం 15 లక్షల విలువ చేసే రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టిఎఫ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.