Take a fresh look at your lifestyle.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ఆర్డీవో రత్నకల్యాణి

 

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే అని నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి అన్నారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు శనివారం

ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోవిజ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్డీవో రత్న కళ్యాణి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. ఆయన చూపిన మార్గాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, డీఈవో భోజన్న, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.