ముద్ర, తుంగతుర్తి….
బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, మహిళలకు విద్యాబోధన కల్పించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు
మహాత్మా జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో… పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలోని అసమానతలు తొలగించి, మహిళలకు ప్రత్యేకంగా విద్యా ఆవశ్యకతను తెలిపిన మహోన్నత మూర్తి అని కొనియాడారు. నేడు పేద ప్రజల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పార్టీ అలుపెరగని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలంతా సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి రావాలని కోరారు. దేశ ప్రజలంతా జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ల ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబు. కలకోట్ల మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సీనియర్ నాయకులు అన్నపర్తి జ్ఞాన సుందర్, మాజీ పిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, పట్టణ కమిటీ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్, మాచర్ల అనిల్, కొండారాజు, చిలుకల వెంకన్న, దాసరి శ్రీనివాస్, నరసయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.