Take a fresh look at your lifestyle.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం-మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్….

 

సమతుల్య ఆహారంతో భవిష్యత్తులో సర్వరోగ నివారణ….

 

కోరుట్ల, ముద్ర;
పోషణ పక్వడ కార్యక్రమంలో భాగంగా శనివారం కోరుట్ల పట్టణ 14వ వార్డు భీమునిదుబ్బ అంగన్వాడి కేంద్రంలో పాలిచ్చే తల్లులకు శిశువుల పోషణ పై సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు పరిపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వార్డు కౌన్సిలర్ రేంజర్ల కళ్యాణి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికలు, చిన్నారులకు పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం అందిస్తేనే భవిష్యత్తులో రోగాలు దరి చేరవని, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. పోషకాహారం వల్ల కలిగే ఆరోగ్యం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలు ఎంత బరువు ఉన్నారో చూసి ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేసుకుని, సప్లిమెంటరీ పోషకాహార నిపుణులచే అవగాహన కల్పించాలని, కిషోర బాలికలకు రక్తహీనత పరీక్షలు జరీపి పోషకాహర ఆహారం తీసుకోవాలని, పిల్లలు గర్భిణీలు బాలింతలు కౌమార దశలోని బాలికలు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ స్థానిక వార్డు కౌన్సిలర్ రేంజర్ల కళ్యాణి ల చేతుల మీదుగా పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక వార్డు కౌన్సిలర్ రెంజర్ల కళ్యాణి, సిడిపిఓ కే. మణెమ్మ, సూపర్వైజర్ ఏ భారతి, అంగన్వాడి టీచర్ ఆర్ రాజమణి ఆర్ పి బి. లక్ష్మి, ఆశా జ్యోతి ఆయమ్మ పి. కవిత, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.