Take a fresh look at your lifestyle.

చీలపల్లి దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీలపల్లి గ్రామంలో ఇటీవల సంచలనం సృష్టించిన దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షించారు. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల నుండి ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, అనుమానితుల వివరాలు, సాంకేతిక విశ్లేషణపై చర్చించారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.
సీసీటీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ డేటా, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, జిల్లాలోని చెక్‌పోస్టులు, అవుట్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేలా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, గ్రామాల్లో రాత్రి పహారా మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, జాన్ రెడ్డి, జార్జ్, రేణుక రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐలు బాలరాజ్, శివానందం, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.