ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :
కరీంనగర్ పట్టణం 26వ డివిజన్ ఆదర్శ్ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, అభయ ఆంజనేయస్వామి దేవస్థానం (శివాలయం)లో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రతి ఏడాది నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, శ్రీదేవి దంపతుల నివాసం నుండి శ్రీరాములవారి ఎదుర్కోలు కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం భక్తుల నడుమ శోభాయాత్రగా దేవాలయానికి తీసుకువచ్చి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.
వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తి భావంతో నిండిపోయింది.
కార్యక్రమాన్ని దేవాలయ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమన్వయంతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు మెతుకు కనకయ్య, కార్యదర్శులు భూమిరెడ్డి ఓ మల్లయ్య, గంధం లక్ష్మీనారాయణ, పిట్టల కనకయ్య, జిల్లి సత్తయ్య, అశోక్ రెడ్డి, ఇట్టినేని శ్రీనివాస్, తోట సత్యనారాయణ, జైపాల్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రమణారావు, రామ్మూర్తి, శ్రీనివాస్ రావు, కోటేశ్వర్, వైద్యుల శ్రీధర్, ఈ రమేష్, గంధం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. ధర్మం, నిజాయితీ, ప్రేమ వంటి విలువలను పాటిస్తూ డివిజన్ మరియు నగరం అభివృద్ధి చెందాలని ఆయన పేర్కొన్నారు.