Take a fresh look at your lifestyle.

61 మందితో డిసిసి కార్యవర్గం

ముద్ర ప్రతినిధి, మెదక్:
61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇందులో 14 మంది ఉపాధ్యక్షులు, 20 మంది ప్రధాన కార్యదర్శులు, 20 మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ఒక కోశాధికారి ఉన్నారు. మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కే.హరిత ఉపాధ్యక్షురాలుగా , తొడుపునూరి శివరామకృష్ణ కోశాధికారిగా అవకాశం లభించింది. డిసిసి అధ్యక్షులుగా నర్సాపూర్ కు చెందిన ఆంజనేయులు గౌడ్ నియామకమైన విషయం తెలిసిందే. జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించడం పట్ల పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.