ముద్ర ప్రతినిధి, మెదక్:
ఉగాది తెలుగు నూతన సంవత్సరం పురస్కరించుకుని పట్టణంలోని అవుసులపల్లి, మండలంలోని పాతూర్, రాజ్ పల్లి గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహించారు.

మెదక్ మున్సిపాలిటీ పరిధిలో గల ఆవుసులపల్లిలో గ్రామ దేవతలకు బండ్ల ప్రదర్శన, బోనాలు సమర్పించారు. ఉత్సవాలకు గ్రామదేవతలు నల్ల పోచమ్మ, దుర్గమ్మ, మత్తడి పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, ఆలయాలను ముస్తాబు చేశారు. ఉగాది పండుగ ఉత్సవాల సందడి నెలకొంది.