Take a fresh look at your lifestyle.

అయ్యప్ప ఆలయంలో పంచాంగ పఠనం

ముద్ర ప్రతినిధి, మెదక్:*
మెదక్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉగాది సందర్బంగా వైద్య రాజు పంతులు పంచాంగ పఠనం చేశారు. భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది నవనాయకులలో ఏడుగురు శుభ ఫలితాలు ఇచ్చే వారుండటంతో అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు. రాజుగా గురుడు, సైన్యాధిపతిగా చంద్రుడు, ధాన్యాధిపతిగా బుధుడు ఉన్నారని వివరించారు. ఈ ఏడాది 4 భాగాల వర్షం కురిసే అవకాశం ఉందని, యమునా పుష్కరాలు ఉండగా ఎలాంటి గ్రహణాలు లేవని ఆయన వివరించారు.
అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడంతో పాటు రహదారులు చాలా గొప్పగా నిర్మించబడతాయన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, పచ్చడి వితరణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.