Take a fresh look at your lifestyle.

శ్రీరామనవమినికి అన్ని ఏర్పాట్లు చేయాలి : చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాబోవు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని వివిధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ అన్ని దేవాలయాల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని దేవాలయాల వద్ద అవసరమగు ఏర్పాట్లు చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.